Revanth Reddy: రేవంత్ పాదయాత్ర ప్రారంభం.. యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్!

Digvijay Singh attends Revanth Reddy padayatra
  • పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాదయాత్ర
  • ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు రేవంత్ పాదయాత్ర
  • బహిరంగసభలో ప్రసంగించనున్న రేవంత్, దిగ్విజయ్ సింగ్
భారీగా పెరిగిపోతున్న నిత్యావసర వస్తువుల ధరలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రను చేపట్టింది. రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు 10 కిలోమీటర్ల మేర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రను చేపట్టారు. కరోనా నిబంధనలను పాటిస్తూ పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ముడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత బహిరంగసభలో రేవంత్, దిగ్విజయ్ సింగ్ ప్రసంగించనున్నారు.
 
కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశ వ్యాప్తంగా పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. నిత్యావసర ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Revanth Reddy
Digvijay Singh
Congress
Padayatra

More Telugu News