Samantha: 'పుష్ప' సినిమా ఐటెం సాంగ్‌పై విమర్శల పట్ల సమంత స్పందన.. వీడియో ఇదిగో
- ఈ సినిమాలో భాగమైనందకు చాలా సంతోషంగా ఉంది
- ఈ ప్రత్యేక సాంగ్ నాకు సవాలుగా అనిపించింది
- అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేశాను
- ఇది ఓ మ్యాడ్నెస్ అన్న సమంత
‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ సమంత ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఈ పాట హైలైట్‌గా నిలిచింది. సమంత డ్యాన్స్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకుంటోంది. ఎక్కడ చూసినా ఇదే పాట వినపడుతోంది.
మరోవైపు, ఈ పాటపై తీవ్ర విమర్శలు గుప్పించే వారూ అధికంగానే ఉన్నారు. ‘మీ మగ బుద్ధే వంకర బుద్ధి’ అనే అనే లైన్‌పై మగవాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘంతో పాటు తమిళనాడు పురుష సంఘం కూడా కోర్టులో కేసులు వేసిన సంగతి తెలిసిందే.
అంతేగాక, ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయడం పట్ల సమంతపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ పాటపై వస్తోన్న విమర్శలపై ఇప్పటికే చంద్రబోస్ తో పాటు ఈ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. అయితే, సమంత మాత్రం ఇన్ని రోజులూ మౌనం వహిస్తూ వచ్చింది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాత్రం ఆమె ఎట్టకేలకు స్పందించింది. ఈ సినిమాలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆమె చెప్పింది. ఈ ప్రత్యేక సాంగ్ తనకు సవాలుగా అనిపించిందని వివరించింది. ఆ పాటలో అల్లు అర్జున్‌కు సమానంగా స్టెప్పులు వేయడం చాలా ఉత్సాహంగా అనిపించిందని తెలిపింది.
ఈ పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా థ్రిల్లింగ్‌గా ఉందని పేర్కొంది. ఇది ఓ మ్యాడ్నెస్ అని తెలిపింది. ట్విట్టర్లో ఈ పాటపై వస్తున్న ఫన్నీ వీడియోను కూడా సమంత పోస్ట్ చేసింది. పరీక్షలో సమాధానాలు రాయకుండా ఊ అంటావా.. ఊహు అంటావా మావా అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందంటూ ఓ విద్యార్థి అంటున్నట్లు ఆ వీడియోలో ఉంది.