ICMR: ఒమిక్రాన్ ను వేగంగా గుర్తించే సరికొత్త కిట్... ఐసీఎంఆర్ ఆవిష్కరణ

ICMR develops Omicron testing kit

  • ప్రపంచదేశాల్లో ఒమిక్రాన్ కలకలం
  • ప్రధానంగా బ్రిటన్ లో నిత్యం వేల కేసులు
  • ప్రాణనష్టం తక్కువగా ఉన్నా, అధికస్థాయిలో వ్యాప్తి
  • డిబ్రూగఢ్ లోని ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ ఆవిష్కరణ  

బ్రిటన్ సహా అనేక ప్రపంచ దేశాలను కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ హడలెత్తిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ లో ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య వేలల్లో ఉండడం కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రాణనష్టం తక్కువగా ఉండడం ఒక్కటే ఊరట తప్ప, ఇది అమితవేగంగా వ్యాప్తి చెందుతూ పలు దేశాలకు సవాలుగా మారింది. ఒమిక్రాన్ ను గుర్తించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ తప్పనిసరి కావడంతో ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే సరికొత్త టెస్టింగ్ కిట్ ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఆవిష్కరించింది. ఈ కిట్ ను, అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డిబ్రూగఢ్ లోని ఐసీఎంఆర్ రీజనల్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసింది. దీనితో త్వరితగతిన ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించే వీలుంటుంది. ఈ కిట్ ను వాణిజ్య పంథాలో భారీ ఎత్తున ఉత్పత్తి చేసేందుకు ఆసక్తి ఉన్న కంపెనీలను ఐసీఎంఆర్ ఆహ్వానిస్తోంది.

  • Loading...

More Telugu News