Krishnamraju: రాధేశ్యామ్ లో 'పరమహంస'గా కృష్ణంరాజు... ఫస్ట్ లుక్ ఇదిగో!

Krishnamraju first look from Radhe Shyam relesed
  • ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధేశ్యామ్
  • కీలకపాత్రలో కృష్ణంరాజు
  • ఆసక్తి కలిగిస్తున్న కృష్ణంరాజు ఫస్ట్ లుక్
  • 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ చిత్రంలో సీనియర్ నటుడు, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక గురువు 'పరమహంస'గా కనిపించనున్నారు. తాజాగా కృష్ణంరాజు పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది.

 కాషాయ దుస్తుల్లో ప్రసన్న వదనంతో రుద్రాక్ష చేతబూనిన కృష్ణంరాజును ఫస్ట్ లుక్ లో చూడొచ్చు. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న 'రాధేశ్యామ్' చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం 2022 జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Krishnamraju
First Look
Paramahamsa
Radhe Shyam
Prabhas
Pooja Hegde
Tollywood

More Telugu News