Revanth Reddy: ఫలితాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా నిలుస్తాం: రేవంత్ రెడ్డి
- ఇటీవల తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల
- 51 శాతం మంది ఫెయిల్
- ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
- ప్రభుత్వం వెంటనే స్పందించాలన్న రేవంత్ రెడ్డి
తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు ఇటీవల విడుదల కాగా, 51 శాతం మంది ఫెయిలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ఫలితాల తీరు పట్ల మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడగా, విపక్షాలు టీఆర్ఎస్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ క్రమంలో నేడు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులు హైదరాబాదులో భారీ ర్యాలీ చేపట్టారు.
దీనిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఫలితాల విషయంలో న్యాయం జరిగేంత వరకు ఇంటర్ విద్యార్థులకు తాము మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల నిరసనలను అణచివేసే బదులు, వెంటనే సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. బలవన్మరణం బాట పట్టకుండా విద్యార్థులను కాపాడాలని, ప్రభుత్వం తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు.