Telangana: తెలంగాణ ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా..?

Telangana govt debts are Rs 237747 Cr

  • నవంబర్ 30 నాటికి రూ. 2,37,747 కోట్లు
  • ఇందులో స్వదేశీ అప్పు రూ. 2,34,912 కోట్లు
  • విదేశీ అప్పు రూ. 2,835 కోట్లు

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం దేశంలోని పలు రాష్ట్రాలు భారీగా అప్పులు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలోనే అప్పులు చేస్తోంది. నవంబర్ 30 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ. 2,37,747 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధురి లోక్ సభలో వెల్లడించారు. ఇందులో స్వదేశీ అప్పు రూ. 2,34,912 కోట్లు, విదేశీ అప్పు రూ. 2,835 కోట్లుగా ఉందని తెలిపారు. ఆర్బీఐ, రీఫైనాన్సింగ్ సంస్థలు, విదేశీ ఆర్థిక సంస్థల వద్ద తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా పంకజ్ చౌధురి ఈ మేరకు సమాధానమిచ్చారు.

  • Loading...

More Telugu News