Balineni Srinivasa Reddy: దాడి నేప‌థ్యంలో మంత్రి బాలినేనిని కలిసిన సుబ్బారావు.. ప‌ర‌స్ప‌రం కేకు తినిపించుకున్న వైనం

gupta meets balineni
  • భేటీతో స‌మ‌సిన వివాదం
  • దాడుల సంస్కృతికి ముగింపు పలకాలన్న గుప్తా
  • కేసు పెట్టే ఉద్దేశం లేద‌ని వ్యాఖ్య‌
వైసీపీ నేత‌ సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ నేత‌లు జరిపిన‌ దాడి క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దృశ్యాలు వైరల్‌ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. దీనిపై ఇప్ప‌టికే స్పందించిన సుబ్బారావు గుప్తా త‌న‌కు మతిస్థిమితం బాగానే ఉంద‌ని చెప్పారు. త‌న‌కు ఎవరిపైనా కేసు పెట్టే ఉద్దేశం కూడా లేదని చెప్పారు. దాడుల సంస్కృతికి తనతోనే ముగింపు పలకాలని ఆయ‌న పేర్కొనడం గ‌మ‌నార్హం.

విజ‌య‌వాడలో మంత్రి బాలినేనిని కలిసిన నేప‌థ్యంలో త‌న‌పై జరిగిన దాడి  ఘ‌టన వివరాలను ఆయనకు గుప్తా వివరించినట్లు సమాచారం. తాను ఎప్పుడూ బాలినేనికి, వైసీపీకి విధేయుడినేనని ఆయ‌న అన్నారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలపై మాత్రమే తాను వ్యాఖ్యలు చేసినట్లు ఆయ‌న వివ‌రించారు. అక్క‌డే సీఎం జగన్‌ జన్మదినోత్స‌వం సంద‌ర్భంగా కేక్‌ కట్‌ చేసి మంత్రి, సుబ్బారావు గుప్తా పరస్పరం తినిపించుకున్నారు.


Balineni Srinivasa Reddy
Andhra Pradesh

More Telugu News