Vinod Kumar: ఇంటర్ ఫస్టియర్ ఫలితాల అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది: తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

State planning commission vice president Vinod Kumar talks about Inter First Year results issue
  • ఇటీవల తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాల విడుదల
  • 51 శాతం మంది ఫెయిల్
  • కుంగుబాటుకు గురైన విద్యార్థులు
  • విద్యార్థి సంఘాల ఆందోళనలు
  • విపక్షాల విమర్శల దాడి
తెలంగాణలో ఇటీవల ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల కాగా, అత్యధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారు. పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా, భగ్గుమన్న విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. అటు విపక్షాలు సైతం ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ అగ్రనేత బి.వినోద్ కుమార్ స్పందించారు. ఇంటర్మీడియన్ ఫస్టియర్ ఫలితాల అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని వెల్లడించారు. ఇంటర్ ఫలితాలపై కరోనా సంక్షోభం ప్రభావం  పడిందని, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. ఆన్ లైన్ బోధన గ్రామీణ ప్రాంతాల వారికి ప్రతికూలంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఫస్టియర్ ఫలితాలపై రాష్ట్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
Vinod Kumar
Inter First Year
Results
Telangana

More Telugu News