Rahul Gandhi: మూకదాడుల పితామహుడు రాజీవ్ గాంధీ.. రాహుల్‌కు బీజేపీ కౌంటర్

Rahul Gandhi Tweets On The Word Lynching BJP Attacks

  • 2014కు ముందు ‘లించింగ్’ పదం ఉనికిలో లేదన్న రాహుల్
  • 1984 సిక్కు అల్లర్లను గుర్తు చేసిన బీజేపీ
  • నాటి ఘటనను కూడా లించింగే అంటారన్న కేంద్రమంత్రి

అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం గర్భగుడిలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని భక్తులు ఇటీవల కొట్టి చంపారు. ఆ తర్వాతి రోజే కపుర్తాలాలోని గురుద్వారాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 24 గంటల వ్యవధిలో రెండు ఘటనలు జరగడం కలకలం రేపింది.

ఈ ఘటనలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2014కు ముందు లించింగ్ (కొట్టి చంపడం) అనే పదం ఉనికిలో లేదని పేర్కొంటూ మోదీకి ట్విట్టర్‌లో వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ విమర్శలపై స్పందించిన బీజేపీ రాహుల్‌పై ఎదురుదాడికి దిగింది. 'లించింగ్‌ పితామహుడు మీ నాన్నే (రాజీవ్ గాంధీ)' అంటూ రాహుల్‌కు కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా 1984 సిక్కు అల్లర్లను ప్రస్తావించింది. నాటి ఘటనలో వందల సంఖ్యలో ఓ వర్గానికి చెందిన వారు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసింది.

అలాగే, 1989 నాటి భాగల్పూర్ అల్లర్లను కూడా గుర్తు చేసిన కేంద్రమంత్రి అశ్వినీ కుమార్ చౌబే.. నాటి ఘటనల్లో ఓ వర్గానికి చెందిన వందలాదిమందిని చంపేశారని, అవి లించింగులు కావా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి దాడులు చాలానే జరిగాయని బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.

  • Loading...

More Telugu News