Actor Siddarth: బాక్సాఫీసు లెక్కల విషయంలో నిర్మాతలు అబద్ధాలు చెబుతున్నారు.. మీడియాదీ అదే దారి: సినీనటుడు సిద్ధార్థ్ అసహనం

Siddharth says producers have been lying about box office numbers
  • పాన్ ఇండియా వసూళ్ల విషయంలో నిజాయతీ లోపించింది
  • అబద్ధపు రిపోర్టులు ఇచ్చేందుకు కమిషన్ ఎంత ముడుతోంది?
  • దర్శకులు కొత్త కథల్ని తెరకెక్కించాలి
పాన్ ఇండియా సినిమా వసూళ్లపై ప్రముఖ సినీ నటుడు సిద్ధార్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిర్మాతలందరూ ఈ విషయంలో అబద్ధాలు చెబుతూ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, ట్రేడ్ వర్గాలు, మీడియా కూడా అదే దారిలో నడుస్తున్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశాడు. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇదే ఒరవడి కొనసాగుతోందని, తప్పుడు లెక్కల్ని అధికారికంగా ప్రకటిస్తున్నారని ఆరోపించాడు.

పాన్ ఇండియా వసూళ్ల విషయంలో నిజాయతీ లోపించిందని, ఇలాంటి అబద్ధపు రిపోర్టులు ఇచ్చేందుకు ఎంత కమిషన్ ముడుతోందంటూ ట్విట్టర్ ద్వారా దుమ్మెత్తిపోశాడు. ఎంత ఇష్టమైన సినిమాను అయినా పదేపదే చూసే అలవాటు తనకు లేదన్నాడు. దర్శకులు కొత్త కథల్ని తెరకెక్కించాలని కోరాడు. తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించిన సిద్ధార్థ్.. చాలాకాలం తర్వాత ఇటీవల ‘మహాసముద్రం’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.
Actor Siddarth
Kollywood
Producer
Directors
PAN India

More Telugu News