East Godavari District: ఏపీలో ముదురుతున్న సినిమా టికెట్ల వ్యవహారం... 50 థియేటర్ల మూసివేత!

5 Cinema theatres closed in East Godavari district

  • టికెట్ ధరలను తగ్గించాల్సిందేనంటున్న ఏపీ ప్రభుత్వం
  • తమకు నష్టం వస్తుందంటున్న థియేటర్ యాజమాన్యాలు
  • తూర్పుగోదావరి జిల్లాలో 50 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేత

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత జీవో 35ని రద్దు చేస్తూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది.

మరోవైపు సినిమా థియేటర్లపై రెవెన్యూ, పోలీసు అధికారులు దాడులు చేస్తున్నారు. థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టికెట్ ధరలు పెంచితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. నిబంధలను పాటించని థియేటర్లకు నోటీసులు ఇస్తూ, సీజ్ చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్పినట్టుగా తక్కువ ధరలకు టికెట్లు అమ్మితే నష్టాలు వస్తాయని... థియేటర్లను నడపలేమని యాజమాన్యాలు అంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50 థియేటర్లను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.

  • Loading...

More Telugu News