Natti Kumar: సినిమా టికెట్ల అంశంలో హీరో నాని వ్యాఖ్యలను తప్పుబట్టిన టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్

Tollywood producer Natti Kumar condemns Nani comments on tickets issue
  • ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు రగడ
  • ఏపీ సర్కారు నిర్ణయం సరికాదన్న నాని
  • నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న నట్టి కుమార్
  • ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలని స్పష్టీకరణ
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుతో పాటు థియేటర్లపై తనిఖీలు జరుగుతుండడం, పలు థియేటర్ల మూసివేత తదితర అంశాలు టాలీవుడ్ లో అసంతృప్తి జ్వాలలు రగుల్చుతున్నాయి. నేచురల్ స్టార్ నాని కూడా తన అసహనాన్ని వెలిబుచ్చడం తెలిసిందే. సినిమా థియేటర్ల కంటే కిరాణా షాపుల కలెక్షన్లే బాగున్నాయని, టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వ నిర్ణయం సముచితం కాదని నాని పేర్కొన్నారు.

కాగా, నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానికి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు.

ఓవైపు తాము ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, అటు, కోర్టులోనూ ఈ వ్యవహారం నడుస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో నాని వ్యాఖ్యల వల్ల మిగతా సినిమాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. నాని తన వ్యాఖ్యలపై ఏపీ సర్కారుకు క్షమాపణలు చెప్పాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు.
Natti Kumar
Producer
Nani
Cinema Tickets
Andhra Pradesh
Tollywood

More Telugu News