Tammineni Sitaram: కబడ్డీ ఆడుతూ బోర్లా పడిపోయిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. వీడియో ఇదిగో!

AP Assembly Speaker Tammineni fall down
  • ఆమదాలవలసలో కబడ్డీ పోటీలను ప్రారంభించిన తమ్మినేని
  • ఆ తర్వాత కబడ్డీ ఆడిన ఏపీ స్పీకర్
  • ఆటగాడిని ఔట్ చేయబోయి బోర్లా పడిన వైనం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఆమదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తమ్మినేని ప్రారంభించారు.

అనంతరం ఆయన కూడా ఆటగాడి అవతారం ఎత్తారు. ఒక టీమ్ తరపున కూతకు వెళ్లారు. ఉత్సాహంగా ముగ్గురిని ఔట్ చేశారు. నాలుగో వ్యక్తిని ఔట్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి కాలు జారి కిందపడిపోయారు. దీంతో వెంటనే సెక్యూరిటీ గార్డులు స్పందించి ఆయనను లేవనెత్తారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Tammineni Sitaram
AP Assembly Speaker
Fall Down

More Telugu News