Akhilesh Yadav: ఆయనకు భారతరత్న ఇవ్వాలి: అఖిలేశ్ డిమాండ్

Akhilesh Yadav demands Bharat Ratna for Charan Singh
  • మాజీ ప్రధాని చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్
  • రైతుల కోసం సర్వం అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అన్న అఖిలేశ్
  • చరణ్ సింగ్ జయంతి సందర్భంగా డిమాండ్
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. భారీ హామీలను గుప్పిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని... ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.
Akhilesh Yadav
Charan Singh
Bharat Ratna
bjp

More Telugu News