omicron: కోవిడ్ ఇక మీదట సాధారణ ఫ్లూగా మారనుందా?: కావచ్చంటున్న కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు

Will Omicron be the final variant of concern of the coronavirus
  • ఒక స్థాయి తర్వాత తీవ్రత తగ్గుతుంది
  • ఇదే ఆఖరి వేరియంట్ కాకపోవచ్చు
  • కానీ, ఆందోళనకరమైన ఆఖరుది ఇదే అవుతుంది
  • శీతాకాలంలో వచ్చే ఫ్లూగా మారొచ్చు
కరోనా వైరస్ ఎప్పుడు అంతమైపోతుందా? అని ఎదురు చూస్తున్న ప్రపంచాన్ని సంతోషపెట్టే అంచనాలను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీన్ని నియంత్రించలేమని చెప్పడానికి ఎటువంటి కారణం లేదన్నారు. రూపం మార్చుకుని వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం చూపిస్తున్నా కానీ, మరణాలను పెంచలేని విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు.

వైరస్ లో వచ్చే ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్) దాని వ్యాప్తిని పెంచగలవేమో కానీ, ఒక స్థాయి తీవ్రత తర్వాత.. అంతకు మించి ఏమీ చేయలేవని పేర్కొన్నారు. మొదట అల్ఫా వేరియంట్ కంటే.. రెండో విడత డెల్టా వేరియంట్ లో కరోనా తీవ్రత, మరణాలు అధికంగా ఉండడాన్ని ప్రస్తావించారు. ఒమిక్రాన్ వేరియంట్ లో మరణాలు, ఆసుపత్రుల్లో చేరడాలు తగ్గడం చూస్తూనే ఉన్నాం. వైరస్ ఇలా మ్యుటేషన్ చెందే కొద్దీ రోగనిరోధక వ్యవస్థకు దొరకకుండా తప్పించుకోవచ్చేమో కానీ, పెద్దగా ప్రభావం చూపించలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.

ఇకపై ఏటా శీతాకాలంలో వచ్చే సాధారణ ఫ్లూ మాదిరిగా కరోనా వైరస్ కూడా మార్పు చెందొచ్చని పేర్కొన్నారు. ‘‘కరోనా ఆఖరి వేరియంట్ ఇదే కాకపోవచ్చు కానీ, ఆందోళన కలిగించే రకం ఇదే చివరిది కావచ్చు. తీవ్రత ఇకపై ఉండకపోవచ్చు. ఈ మహమ్మారిని అంచనా వేయడం కష్టమే. కాకపోతే ఇది క్రమంగా స్థానిక వైరస్ గా మారిపోవచ్చు. చాలా స్వల్పస్థాయి వ్యాధి కారక వైరస్ గా మారడం వల్ల.. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, మరణాలు కూడా తగ్గుతాయి’’ అని కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
omicron
Cambridge university
corona
sesonal flu

More Telugu News