Revanth Reddy: టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగల్లా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయి: రేవంత్ రెడ్డి

Revanth Reddy fires on TRS ministers

  • రగులుతున్న ధాన్యం కొనుగోలు అంశం
  • టీఆర్ఎస్ నేతలు వీధి నాటకాలకు తెరలేపారంటూ విమర్శలు  
  • మంత్రులు ఢిల్లీ వదిలి రావొద్దన్న రేవంత్
  • కేంద్రం నుంచి హామీ తీసుకోవాలని స్పష్టీకరణ

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ అంశంలో తీవ్రస్థాయిలో స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగల్లా మారి రైతులకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో కాదు గల్లీలో తేలుస్తామని ఎంపీలు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చారని... గల్లీలో కాదు ఢిల్లీలో తేలుస్తామని మంత్రులు ఢిల్లీకి వచ్చారని అన్నారు.

కానీ, ఢిల్లీ వచ్చిన మంత్రులు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. ఈ వారం రోజులుగా మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి ఏంతేల్చారని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు టీఆర్ఎస్ నేతలు వీధినాటకాలకు తెరలేపారని విమర్శించారు.

"అదనపు ధాన్యంపై కేంద్రానికి మీరు ఏం నివేదిక ఇచ్చారు? అసలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య ఏం జరిగిందో వెల్లడించండి. అదనపు ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వండి. వానాకాలం పంట కొనుగోలు, యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనుగోలుపై కేంద్రం హామీ ఇచ్చేంతవరకు ఢిల్లీలోనే ఉండండి... ఆమరణ దీక్ష చేపట్టండి. కేంద్రం నుంచి హామీ రాకుండా మాత్రం మీరు ఢిల్లీని వదిలి రాష్ట్రానికి రావొద్దు" అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News