Somu Veerraju: గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే... ప్రస్తుత సీఎం మాటలతో మోసం చేస్తున్నారు: సోము వీర్రాజు విమర్శలు

Jagan diverting funds given by Modi says Somu Veerraju
  • ఏపీకి జగన్, చంద్రబాబు చేసిందేమీ లేదు
  • వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది
  • వీరిద్దరూ స్టిక్కర్ సీఎంలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వీరిద్దరూ మాటలతో జనాలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేశారో వీరిద్దరూ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు పనులు చేయరు, చేసే వారిని అడ్డుకుంటారని చెప్పారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే... ప్రస్తుతం సీఎం  మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ స్టిక్కర్ సీఎంలని ఎద్దేవా చేశారు.

రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఆనాడే ఆయన అభివృద్ధి చేసి ఉంటే... అమరావతి రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి వచ్చుండేది కాదని అన్నారు. కమ్యూనిస్టులు కమీషన్ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. దేశంలో విద్యావ్యవస్థ నాశనం కావడానికి కమ్యూనిస్టులే కారణమని అన్నారు.  

కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే... వైసీపీ ప్రభుత్వం డబ్బులు మళ్లిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి మోదీ వేసిన డబ్బులను జగన్ లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు.
Somu Veerraju
BJP
Narendra Modi
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News