Sujana Chowdary: ఏపీలో తలా తోక లేని పాలన కొనసాగుతోంది: సుజనా చౌదరి

AP went back 30 years in Jagans rule says Sujana Chowdary
  • జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది
  • రాష్ట్రంలో ఉన్న లొసుగుల వల్లే కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమీ అడగలేకపోతోంది
  • వైసీపీ నేతల్లో అభద్రతా భావం నెలకొంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లొసుగుల కారణంగానే కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఏదీ అడగలేకపోతోందని చెప్పారు. తలా తోక లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు. రానున్న 30 నెలల్లో బీజేపీ సత్తా ఏమిటో చూపిస్తామని చెప్పారు. వైసీపీలో ఆ పార్టీ నేతలే ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సుబ్బారావు గుప్తాలాంటి వారికి ఏం జరిగిందో చూశామని... వైసీపీ నేతల్లో అభద్రతా భావం నెలకొందని చెప్పారు.
Sujana Chowdary
BJP
Jagan
YSRCP

More Telugu News