Lungi Ngidi: వరుస బంతుల్లో మయాంక్ అగర్వాల్, పుజారాలను అవుట్ చేసిన ఎంగిడి

Ngidi sent Mayank Agarwal and Chateswar Pujara in back to back deliveries

  • సెంచురియన్ లో టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్
  • ఓపెనర్ల శుభారంభం
  • తొలి వికెట్ కు 117 పరుగులు జోడించిన వైనం
  • 117 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్, పుజారా అవుట్

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా ఆశాజనకంగా ఆడుతోంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేసి లుంగీ ఎంగిడి బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాతి బంతికే ఛటేశ్వర్ పుజారా కూడా అవుట్ కావడంతో టీమిండియా ఇబ్బందుల్లో పడింది. 41వ ఓవర్ రెండో బంతికి మయాంక్ అగర్వాల్ అవుట్ కాగా, మూడో బంతికి పుజారా వెనుదిరిగాడు. ఆడిన తొలి బంతికే అవుటైన పుజారా... మరోసారి పేలవ ఫామ్ తో మూల్యం చెల్లించుకున్నాడు.

ఈ టెస్టులో హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ లను కాదని రహానే, పుజారాలను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పుజారా డకౌట్ కావడంతో విమర్శకుల వాదనకు మరింత బలం చేకూరుతోంది. కాగా, సెంచురియన్ టెస్టులో టీ విరామ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News