Telangana: తగ్గిన చలి.. పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం!
- తెలంగాణలోని ఉత్తరాది జిల్లాల్లో వానలు
- వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
- హైదరాబాద్ లో 17.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర నమోదు
మొన్నటిదాకా తెలంగాణలో చలి విపరీతంగా వణికించింది. ఇప్పుడు ఆ చలి కాస్త తగ్గింది. అయితే, రాష్ట్రంలో రేపట్నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని అధికారులు చెప్పారు.
కాగా, నిన్న హైదరాబాద్ లో 17.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగత్ర నమోదైంది. ఇది సాధారణం కన్నా 2.3 డిగ్రీలు ఎక్కువ. మెదక్ లో 13.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఏజెన్సీ జిల్లా ఆదిలాబాద్ లో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 20 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.