5g technology: 5జీతో మరింత స్మార్ట్.. మన జీవితాల్లో పెరగనున్న వేగం

opportunities that 5G will herald in the smart era

  • 4జీతో పోలిస్తే 10 రెట్ల అధిక వేగం
  • వర్చువల్ రియాలిటీకి అనుకూలం
  • వేగంగా స్ట్రీమింగ్, గేమింగ్
  • స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోనూ కదలిక
  • మరింత మెరుగ్గా ట్రాఫిక్ రద్దీ

నిదానంగా, ప్రశాంతంగా నడిచే మన జీవితాల్లోకి 3జీ వచ్చి కాస్త వేగాన్ని పెంచింది. స్మార్ట్ ఫోన్లపై కొంత సమయాన్ని గడిపేలా చేసింది. రిలయన్స్ జియో 4జీ టెక్నాలజీ సేవలు మరింత వేగాన్ని పెంచడమే కాకుండా.. చాలా పనులను స్మార్ట్ గా చేసేందుకు తోడ్పడింది. ఆన్ లైన్ లో ఉన్న అపారమైన సమాచారాన్ని అందిపుచ్చుకునే అవకాశాన్ని 4జీ టెక్నాలజీ తెచ్చిపెట్టింది. కానీ 2022లో రానున్న 5జీ టెక్నాలజీ మానవ జీవనాన్ని మరింత స్మార్ట్ గా మార్చనుంది. మరింత వేగాన్ని జోడించనుంది.

కరోనాతో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అందరికీ అనుభవంలోకి వచ్చింది. దీన్ని 5జీ టెక్నాలజీ మరింత కొత్త పుంతలు తొక్కించనుంది. పనుల సామర్థ్యాన్ని పెంచనుంది. రోజువారీ చాలా పనులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆటోమేట్ కానున్నాయి. దీంతో మరింత వినూత్నతతో పనిపై ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉద్యోగులకు రానున్నది. 5జీ టెక్నాలజీ హైబ్యాండ్ విడ్త్ అయినందున జాప్యం తగ్గుతుంది. వర్చువల్ రియాలిటీ సాయంతో ఒక బృందంలోని సభ్యులు ఒక్కచోట లేకపోయినా కానీ, పక్కపక్కనే కూర్చున్న మాదిరి పనులు చేసుకుని పోవచ్చు.

5జీలో డేటా వేగం 10-30 గిగాబైట్ల వరకు ఉంటుంది. 4జీ స్పీడ్ కంటే 100 రెట్లు ఎక్కువ. దీనివల్ల స్ట్రీమింగ్ అవాంతరాలు లేకుండా సాగిపోతుంది. గేమ్ లు సహా అన్ని రకాల డౌన్ లోడ్ లు సూపర్ స్పీడ్ తో జరిగిపోతాయి. దీనివల్ల విలువైన సమయం ఎంతో ఆదా అవుతుంది. దాంతో ఇతర పనులకు వీలు చిక్కుతుంది. వినియోదారుల అనుభవాన్ని 5జీ కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని టెక్నాలజీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హెల్త్ కేర్ సేవలు కూడా మరింత వేగంగా మారిపోనున్నాయి. స్మార్ట్ డివైజెస్ సాయంతో ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం తేలిక అవుతుంది. ప్రతీ పర్యాయం వైద్యుల వద్దకు వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుంది. వేరబుల్ హెల్త్ కేర్ డివైజెస్ సాయంతో తమ ఆరోగ్యం వివరాలను వైద్యులకు ఆన్ లైన్ లో పంపించి వారి సేవలను తీసుకోవచ్చు. ఇంటికే వచ్చి పరీక్షల నమూనాలను తీసుకెళ్లిపోవడం, ఆ ఫలితాలను ఏకకాలంలో రోగులు, వైద్యులకు పంపించడం వేగంగా జరిగిపోతాయి. ఒంటికి ధరించే పరికరాలతో ప్రమాదాలను ముందుగానే పసిగట్టడానికి వీలుంటుంది.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టును 5జీ మరింత ముందుకు తీసుకెళ్లనుంది. ఏఐ, మ్యాపింగ్ సాయంతో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ మరింత మెరుగ్గా నిర్వహించుకునే అవకాశం లభిస్తుంది. రద్దీ లేని ప్రాంతాలకు సంబంధించి సూచనలను రియల్ టైమ్ లో వాహనదారులకు అందించొచ్చు. దీనంతటికీ 5జీ బ్రాడ్ బ్యాండ్ కీలకమవుతుంది. ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటి ఎన్నో మార్పులకు 5జీ చోటు కల్పించనుంది.

  • Loading...

More Telugu News