Vangaveeti Narendra: మా మధ్య విభేదాలు ఉండొచ్చు... నా తమ్ముడి జోలికి ఎవరైనా వస్తే అంతు తేలుస్తా: రాధా సోదరుడు వంగవీటి నరేంద్ర

Vangaveeti Narendra reacts to Vangaveeti Radha comments
  • తన హత్యకు కుట్ర జరుగుతోందన్న రాధా
  • రెక్కీ కూడా నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు
  • తీవ్రంగా స్పందించిన వంగవీటి నరేంద్ర
  • చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
వంగవీటి రంగా వర్ధంతి సభలో ఆయన కుమారుడు వంగవీటి రాధా మాట్లాడుతూ, తన హత్యకు కుట్ర జరుగుతోందని, రెక్కీ కూడా నిర్వహించారని సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై రాధా పెదనాన్న కుమారుడు వంగవీటి నరేంద్ర తీవ్రంగా స్పందించారు. తన తమ్ముడి జోలికి వస్తే వాళ్ల అంతు చూస్తానని హెచ్చరించారు.

"రాధా టీడీపీలోకి వెళ్లడం నాకు ఇష్టం లేదు. రంగా హత్యకు టీడీపీ కారణం కాదని నాడు రాధా అన్నాడు. అందుకే మా తమ్ముడు రాధాతో రాజకీయంగా విభేదించాను. మా మధ్య వంద ఉండొచ్చు... కానీ మా జోలికి ఎవరొచ్చినా వదిలే ప్రసక్తే లేదు" అని స్పష్టం చేశారు.

విభేదాలు రాజకీయాల వరకేనని, కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని భావిస్తున్నానని తెలిపారు.  రాధాకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర పన్నినా మొదట తనను ఎదుర్కోవాల్సి ఉంటుందని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు.
Vangaveeti Narendra
Vangaveeti Radha
Ranga
Vijayawada
TDP
Andhra Pradesh

More Telugu News