TS High Court: వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు

High Court reserves verdict on CM Jagan bail cancellation petition

  • తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ 
  • జగన్ సీఎం హోదాలో సాక్షులను ప్రభావితం చేస్తారని వాదన  
  • పరిస్థితిలో మార్పేమీ లేదన్న సీబీఐ

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. ఎంపీ రఘురామకృష్ణరాజు తరఫున న్యాయవాది శ్రీ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరారు. జగన్ కు నోటీసులు పంపాలని కోరారు.

అందుకు ప్రతిస్పందించిన హైకోర్టు ధర్మాసనం... బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్ పై మీ వైఖరి ఏమిటి? అని సీబీఐని ప్రశ్నించింది. గతంలో జగన్ కు బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని, అప్పటినుంచి ఇప్పటివరకు పరిస్థితి సాధారణంగానే ఉందని సీబీఐ జవాబిచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం తెలంగాణ హైకోర్టు తీర్పును రిజర్వ్ లో ఉంచుతున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News