Sri Lanka: సరికొత్త వివాహ చట్టాన్ని తీసుకొచ్చిన శ్రీలంక.. విదేశీయులకు ఇబ్బందే!
- శ్రీలంకవాసులను పెళ్లి చేసుకోవాలంటే రక్షణ శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి
- జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం
- కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
శ్రీలంకలో సరికొత్త వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఇకనుంచి శ్రీలంకలో స్థానికులను విదేశీయులు పెళ్లి చేసుకోవాలనుకుంటే... ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రతా కారణాల వల్లే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ దేశంలోని ప్రతిపక్షాలు, పలు పౌర సంఘాలు వ్యతిరేకించాయి.
ఇక కొత్త వివాహ చట్టం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తోంది. శ్రీలంకవాసులు, విదేశీయుల మధ్య జరిగే వివాహాల వల్ల జాతీయ భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని... ఇకపై ఈ వివాహాలకు విదేశీయులు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఆఫ్ సెక్యూరిటీ'ని తెచ్చుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ అక్టోబర్ 18న విడుదల చేసిన సర్క్యులర్ లో పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకున్న తర్వాతే ఈ వివాహాలను అదనపు జిల్లా రిజిస్ట్రార్ ద్వారా నమోదు చేస్తామని చెప్పారు.