Nitesh Rane: ఆదిత్య థాకరేను చూసి "మ్యావ్" అంటూ పిల్లిలా అరిచిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA Nitesh Rane cat calls Aditya Thackeray
  • అసెంబ్లీ ప్రాంగణానికి విచ్చేసిన మంత్రి ఆదిత్య థాకరే
  • అప్పటికే అక్కడ బీజేపీ సభ్యుల నిరసన
  • మంత్రిని చూసి పిల్లిలా అరిచిన బీజేపీ ఎమ్మెల్యే రాణే
  • శివసేన ఆగ్రహం
  • రాణేను మందలిస్తామన్న బీజేపీ
మహారాష్ట్ర మంత్రి, శివసేన యువనేత ఆదిత్య థాకరేను చూసి ఓ బీజేపీ ఎమ్మెల్యే పిల్లిలా అరవడం వివాదాస్పదం అయింది. గతవారం ఆదిత్య థాకరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగా, అప్పటికే అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనలు తెలుపుతున్నారు. ఇంతలో అక్కడ ఆదిత్య థాకరే కనిపించడంతో, ఆయనను చూసి బీజేపీ ఎమ్మెల్యే నితీశ్ రాణే పిల్లిలా "మ్యావ్" అంటూ పెద్దగా అరిచాడు.

నితీశ్ రాణే కేంద్రమంత్రి నారాయణ్ రాణే తనయుడు. జూనియర్ థాకరేను చూసి "మ్యావ్" అని అరవడంపై మీడియా నితీశ్ రాణేను వివరణ కోరగా, "అవును అరిచాను... మళ్లీ ఆ విధంగా అరుస్తాను కూడా" అని బదులిచ్చారు. ఈ పిల్లి కూతలపై అసెంబ్లీలో హోరాహోరీ నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ వెనక్కి తగ్గింది. అనుచితంగా ప్రవర్తించిన నితీశ్ రాణేను మందలిస్తామని హామీ ఇచ్చింది. దాంతో శివసేన సభ్యులు శాంతించారు.
Nitesh Rane
Meaw
Catcall
Aditya Thackeray
Shivsena
BJP
Maharashtra

More Telugu News