YS Sharmila: బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవు: షర్మిల

YS Sharmila slams CM KCR over electricity charges hike

  • సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తిన షర్మిల
  • చార్జీలన్నీ పెంచేస్తున్నారంటూ విమర్శలు
  • సామాన్యుడిపై కరెంట్ భారాన్ని మోపారని వెల్లడి
  • వైఎస్సార్ హయాంలో చార్జీలు పెరగలేదన్న షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్ హయాంలో ఏ రోజు కూడా ఆర్టీసీ చార్జీలు కానీ, ఇంటి పన్నులు కానీ, విద్యుత్ చార్జీలు కానీ పెరిగింది లేదని తెలిపారు. కానీ బంగారు తెలంగాణలో కేసీఆర్ పెంచని చార్జీలంటూ లేవని విమర్శించారు. మొన్న ఆర్టీసీ చార్జీలు పెంచి, నేడు కరెంటు చార్జీల భారం మోపారని ఆరోపించారు.

50 యూనిట్ల లోపు వాడుకునే 40 లక్షల పేదలను కూడా వదలకుండా ముక్కు పిండి వసూలు చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఏడాదికి రూ.6,800 కోట్ల లోటును పూడ్చుకునేందుకు సామాన్యుడిపై విద్యుత్ భారాన్ని మోపాడని మండిపడ్డారు. దూకుడు ఖర్చులకు, దొర పోకడలకు తెచ్చిన అప్పుల మీద వడ్డీకి వడ్డీ ప్రజల నుంచే వసూలు చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనానికి కరెంటు షాక్ ఇచ్చిన టీఆర్ఎస్ కు ఎన్నికల్లో ఓటమి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉండాలంటూ షర్మిల పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News