YS Sharmila: రూ.50కే నాణ్యమైన మద్యం అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందన

YS Sharmila responds to Somu Veerraju liqour statement and KTR reaction
  • సోము వీర్రాజు ప్రకటనపై విమర్శలు
  • ఆహా ఎంత గొప్ప పథకం అంటూ కేటీఆర్ ట్వీట్
  • కేటీఆర్ ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యలు
  • లిక్కర్ తో ప్రజల రక్తం పీల్చుతున్నారంటూ ఆగ్రహం
తమను గెలిపిస్తే నాణ్యమైన మద్యం క్వార్టర్ రూ.50కే అందిస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన విమర్శలకు దారితీసింది. "ఆహా ఏమి పథకం!" అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించగా... కేటీఆర్ ను ఉద్దేశించి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

"చీప్ లిక్కర్ తో బీజేపీ... ఖరీదైన మద్యంతో టీఆర్ఎస్! మద్యం ద్వారా నేతలు ప్రజల రక్తం పీల్చుతున్నారు. ఎక్కడ చూసినా మద్యం, ఏ సమయంలోనైనా మద్యం! లిక్కర్ పేరుతో దోచుకుంటున్నారు. మద్యానికి ప్రజలను, యువతను బానిసలను చేస్తున్నారు. మహిళల భద్రతను గాలికొదిలేస్తూ, జోరుగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ, స్కూళ్ల పక్కన కూడా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు" అంటూ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila
Liquor
Somu Veerraju
KTR
BJP
TRS
Telangana

More Telugu News