IT Raids: దేశంలో మొబైల్ తయారీ కంపెనీలపై ఐటీ దాడులు

IT raids on Mobile manufacturers
  • ఈ నెల 21న దేశవ్యాప్తంగా దాడులు
  • విదేశాల నియంత్రణలో ఉన్న మొబైల్ కంపెనీలే లక్ష్యం
  • సోదాల్లోకీలక సమాచారం సేకరణ
  • కంపెనీలు పొంతన లేని సమాచారం ఇచ్చాయన్న ఐటీశాఖ
దేశంలోని మొబైల్ తయారీ కంపెనీలపై ఈ నెల 21న దాడులు నిర్వహించినట్టు ఆదాయపన్ను శాఖ నేడు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టినట్టు తెలిపింది. తమిళనాడు, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఢిల్లీ, అసోంలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపినట్టు ఐటీ విభాగం పేర్కొంది.

ముఖ్యంగా, విదేశాల నియంత్రణలోని మొబైల్ కమ్యూనికేషన్స్ సంస్థలు, ఫోన్ల కంపెనీలు, సంబంధిత వ్యక్తులపై దాడులు చేసినట్టు తెలిపింది. రెండు ముఖ్య కంపెనీలు విదేశాల్లో ఉన్న తమ గ్రూప్ కంపెనీలకు రాయల్టీ రూపంలో రూ.5,500 కోట్లు చెల్లించాయని ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. కంపెనీలు ఇచ్చిన వివరాలకు, సోదాల్లో తాము సేకరించిన వివరాలకు ఏమాత్రం పొంతనలేదని స్పష్టం చేసింది.
IT Raids
Mobile Companies
Royalty
Foreign Control
India

More Telugu News