Liquor Sales: నేడు వెల్లువెత్తిన మద్యం అమ్మకాలు... వివరాలు తెలిపిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ
- నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సంసిద్ధం
- ఊపందుకున్న మద్యం అమ్మకాలు
- వైన్ షాపుల వద్ద కిటకిట
- బిల్లింగ్ క్లోజ్ చేసే వేళకు రూ.104 కోట్ల అమ్మకాలు
కొత్త సంవత్సరానికి కోటి ఆశలతో ప్రజానీకం స్వాగతం పలుకుతున్న తరుణంలో మద్యం ఏరులై పారుతోంది. నేడు బిల్లింగ్ ముగించే సమయానికి 40 లక్షల కేసుల మద్యం, 34 లక్షల కేసులు బీర్ల అమ్మకాలు జరిగినట్టు తెలంగాణ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ స్థాయిలో లిక్కర్ విక్రయాలు ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇవాళ ఒక్కరోజే రూ.104 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్టు వివరించింది. ఈ అర్ధరాత్రి 12 గంటలకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.
అటు, ఏపీలో ప్రీమియం బ్రాండ్ల రంగప్రవేశంతో మందుబాబుల్లో జోష్ నెలకొంది. ప్రీమియం బ్రాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, అనూహ్యరీతిలో మద్యం అమ్మకాలు పుంజుకున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం పెద్దఎత్తున కొనుగోళ్లు చేసేందుకు మందుబాబులు తరలిరావడంతో వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడింది.