Yogi Adityanath: మన దేశానికి అతిపెద్ద సమస్య ఈ పార్టీనే: యోగి ఆదిత్యనాథ్

Big problem is with congress says Yogi Adityanath
  • అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
  • రాయ్ బరేలీలో కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారు
  • రాయ్ బరేలీలో కాంగ్రెస్ కనుమరుగవుతుంది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మన దేశానికి అతిపెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అవినీతి, అరాచకాలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు.

కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నిర్వహించిన జన విశ్వాస్ యాత్ర సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయ్ బరేలీ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని...  కొన్ని రోజుల్లో రాయ్ బరేలీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని అన్నారు. రాయ్ బరేలీ లోక్ సభ స్థానానికి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో సమాజ్ వాదీ పార్టీపై కూడా యోగి విమర్శలు గుప్పించారు. ఏదైనా వాహనంపై ఆ పార్టీకి చెందిన జెండా ఉందంటే... అందులో ఆ పార్టీకి చెందిన ఒక గూండా కూర్చున్నాడని ప్రజలు అనుకుంటుంటారని దుయ్యబట్టారు.
Yogi Adityanath
BJP
Congress
Sonia Gandhi

More Telugu News