Telangana: న్యూ ఇయర్ వేళ.. హైదరాబాదులో నిన్న రాత్రి రికార్డ్ స్థాయిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు

Record Number Of Drunken Drive Cases Reported Yester night
  • హైదరాబాద్ లోని 3 కమిషనరేట్లలో 3,416 కేసులు
  • 265 బృందాలతో పోలీసుల తనిఖీలు
  • అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,528 కేసులు నమోదు
నూతన సంవత్సర ఆగమనం వేళ నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీగా డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. పార్టీలు, పబ్బులతో యూత్ మస్త్ జోష్ లో గడిపారు. ఈ క్రమంలోనే మందుబాబులను కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేశారు.

మొత్తంగా ఒక్క రాత్రిలోనే రికార్డ్ స్థాయిలో 3,416 కేసులను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా సైబరాబాద్ పరిధిలో 1,528, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,258, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 360 కేసులను నమోదు చేసినట్టు చెప్పారు. మొత్తం 265 బృందాలతో తనిఖీలు చేశామన్నారు.
Telangana
Hyderabad
Drunk Driving

More Telugu News