Vijay Sai Reddy: ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy slams AP BJP Chief Somu Veerraju
  • జిన్నా టవర్, కేజీహెచ్ ల పేర్లపై బీజేపీ నేతల  విమర్శలు
  • పేర్లు మార్చాలని డిమాండ్
  • చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి
  • చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన డామేజికి కవరింగ్ అని వ్యాఖ్య  
వైజాగ్ లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) పేరులో కింగ్ ఎవరు? జార్జ్ ఎవరు?... ఆ పేరు మార్చాల్సిందే... గుంటూరులోని జిన్నా టవర్ కు దేశద్రోహి జిన్నా పేరును పెడతారా?... అంటూ ఏపీ బీజేపీ నేతలు ఇటీవల విమర్శలు చేయడం తెలిసిందే.

దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలు అని పేర్కొన్నారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేర్లను మార్చాలని డిమాండ్ చేసే బదులు... ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిధుల కోసమో, లేక, వైజాగ్ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వద్దనో తమ జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తేవాలని ఏపీ బీజేపీకి విజయసాయి హితవు పలికారు.
Vijay Sai Reddy
Somu Veerraju
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News