Kangana Ranaut: కొత్త సంవత్సరంలో నేను కోరుకుంటున్నది ఇదే: కంగనా రనౌత్

I want more love letters in new year says Kangana Ranaut
  • తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకున్న కంగన
  • కాళహస్తిలో రాహుకేతు పూజల నిర్వహణ  
  • శ్రీకాళహస్తి ఆలయం చాలా అద్భుతంగా ఉందన్న కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, శ్రీకాళహస్తి ముక్కంటీశ్వరుడిని దర్శించుకున్నారు. కాళహస్తిలో ఆమె ప్రత్యేక రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె స్పందిస్తూ ఆ వివరాలను తెలిపారు.

'కొత్త సంవత్సరాన్ని తిరుపతి బాలాజీ ఆశీర్వాదాలతో ప్రారంభించా. ప్రపంచంలో ఏకైక రాహు కేతు ఆలయం ఉంది. అది తిరుపతికి సమీపంలో ఉంది. అక్కడ కొన్ని పూజలు చేయించుకున్నా. పంచభూత లింగాలలో ఒకటైన వాయు లింగం కూడా ఇక్కడ ఉంది. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది. నా శత్రువుల దయ కూడా నామీద ఉండాలని ఇక్కడకు వచ్చాను. కొత్త సంవత్సరంలో పోలీస్ ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్ లు తక్కువగా ఉండాలని, లవ్ లెటర్స్ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నా. రాహు కేతుజీకి జై' అని పోస్ట్ చేశారు.
Kangana Ranaut
Bollywood
Tirumala
Sri Kalahasthi

More Telugu News