Chandrababu: రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో తేల్చాలి: చంద్రబాబు

Chandrababu questions AP govt over Vangaveeti Radha issue
  • తన హత్యకు రెక్కీ జరిగిందన్న వంగవీటి రాధా
  • రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు
  • దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉందని వ్యాఖ్యలు
  • అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆగ్రహం
తన హత్యకు రెక్కీ జరిగిందంటున్న వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కలిశారు. రాధా ఇంటికి వెళ్లి మాట్లాడారు. అనంతరం చంద్రబాబు స్పందిస్తూ, రాధాపై రెక్కీ సమయంలో వచ్చిన కారు ఎవరిదో పోలీసులు తేల్చాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఇస్తామని చెప్పి అసలు దోషులను తప్పిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాపై రెక్కీ జరిగిందా? లేదా? అనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు.

రెక్కీపై పోలీసుల వద్ద ఉన్న ఆధారాలు కూడా బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలీసులు కావాలనే కాలయాపన చేస్తున్నారనిపిస్తోందని ఆరోపించారు. "రెక్కీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? దోషులను కాపాడేలా ప్రభుత్వ వైఖరి ఉంది. రెక్కీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంలేదు. వారం గడుస్తున్నా ఇంతవరకు ఏమీ తేల్చలేదు. నా లేఖ ఆధారంగా విచారణ చేయలేరా? ఇలాంటి ఘటనల్లో కాలయాపన మంచిది కాదు" అని స్పష్టం చేశారు.
Chandrababu
Vangaveeti Radha
Recce
Police
YCP Govt

More Telugu News