Viral Pics: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు మోహిత్.. ఫొటోలు వైరల్
- ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మోహిత్ రైనా
- ఆశీర్వదించాలని వినతి
- ప్రేమకు అవధులు లేవని వ్యాఖ్య
బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన రహస్యంగా పెళ్లి చేసుకోవడం గమనార్హం. పెళ్లికి సంబంధించిన వార్తను ఎవ్వరికీ చెప్పని ఆయన న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేశాడు. పెళ్లి ముహూర్తం వచ్చేవరకు ఆయన తన వివాహాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాడన్న విషయం మాత్రం తెలియరాలేదు. గత కొన్నాళ్లుగా ఆయన ఓ అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నాడు.
ఆ విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త తీసుకున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకుని కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతోందని ఫొటోలు పోస్ట్ చేశాడు. తనను అందరూ ఆశీర్వదించాలని కోరాడు. ఆయనకు సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోహిత్ మొదట్లో మహాదేవ్ సీరియల్లో శివుడి పాత్రలో అందరినీ మెప్పించాడు. అనంతరం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఆయన ఎవరికీ చెప్పకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా సమయంలో ఎవరూ ఇబ్బందులు పడకూడదనే ఆయన తన పెళ్లి గురించి ముందుగా వివరాలు తెలపలేదన్న ప్రచారం కూడా జరుగుతోంది. మోహిత్ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పెళ్లి కూతురితో పాటు చిరునవ్వులు చిందిస్తూ ఆయన దిగిన ఫొటోలు అలరిస్తున్నాయి. ప్రేమకు ఎటువంటి అవధులు లేవని, దాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. తన భార్య పేరు అదిథి అని తెలిపాడు. కాగా, ప్రస్తుతం మోహిత్ రైనా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.