Tollywood: దీప్తి సునయన–షణ్ముఖ్ బ్రేకప్ పై బిగ్ బాస్ ఫేం సిరి స్పందన!

Siri Responds To Deepti Shanmukh Break Up
  • తాను కారణం కాదంటూ సన్నిహితుల వద్ద కామెంట్
  • ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ ఆవేదన
  • ఇన్ స్టాలో పెట్టిన కోట్ వైరల్
దీప్తి సునయన, బిగ్ బాస్ 5 ఫేం షణ్ముఖ్ ల బ్రేకప్ ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. షణ్ముఖ్ తో తన రిలేషన్ కు బ్రేకప్ చెబుతున్నట్టు తొలుత దీప్తి సునయన సుదీర్ఘ పోస్ట్ తో ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. ఆ తర్వాత షణ్ముఖ్ కూడా బ్రేకప్ గురించి ప్రకటన చేశాడు. అయితే, ఐదేళ్ల పాటు రిలేషన్ లో ఉండి విడిపోవడమేంటని నెటిజన్లు షాక్ అయ్యారు. దీనికి కారణం బిగ్ బాస్ 5 ఫేం సిరినే కారణమని ఆరోపణలూ గుప్పించారు.

బిగ్ బాస్ లో షణ్ముఖ్, సిరిలు చాలా సన్నిహితంగా మూవ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వల్లే వారిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. అయితే, వారిద్దరూ విడిపోవడానికి తాను కారణం కాదంటూ తన సన్నిహితుల వద్ద ఆమె చెప్పినట్టు తెలుస్తోంది. అసలు ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదని వాపోయిందట. అంతేకాదు.. సిరి ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది. ‘‘ఎవరైనా మీ దగ్గరికి వచ్చి.. మీ జీవితం చాలా కఠినంగా ఉందని అంటే.. వాటికన్నా నేను ఇంకా కఠినం అంటూ సమాధానం చెప్పండి’’ అంటూ మునిబా మజారి చెప్పిన కోట్ ను ఆమె పోస్ట్ చేసింది.
Tollywood
Deepthi Sunaiana
Shanmukh
Bigg Boss
Siri

More Telugu News