flipkart: ఫ్లిప్ కార్ట్ సేవలకు అంతరాయం.. !

Flipkart website app down for some users in India
  • పనిచేయని వెబ్ సైట్, మొబైల్ యాప్
  • ఓపెన్ అవుతున్నా కానీ కనిపించని ఫీచర్లు
  • ఆర్డర్లు చేయలేని పరిస్థితి
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్, మొబైల్ అప్లికేషన్లలో సోమవారం సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇవి పనిచేయడం లేదంటూ సామాజిక మాధ్యమ వేదికలపై యూజర్లు పోస్ట్ చేయడం కనిపించింది. వెబ్ సైట్ ఫ్రంట్ పేజీ ఓపెన్ అవుతున్నప్పటికీ.. లాగిన్ అయిన తర్వాత కొన్ని సేవలు కనిపించడం లేదు. మొబైల్ యాప్ లోనూ ఫీచర్లు పనిచేయడం లేదు.

యూజర్ లకు ఎర్రర్ మెస్సేజ్ దర్శనమిస్తోంది. దీంతో ఆర్డర్లు ప్లేస్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై ఫ్లిప్ కార్ట్ నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు. సాంకేతిక సమస్యలు ఇప్పటికే సుమారు రెండు గంటల నుంచి దర్శనమిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థకు 35 కోట్ల కస్టమర్ లు ఉన్నారు.
flipkart
service down
webisite app

More Telugu News