Team India: ప్రారంభమైన రెండో టెస్టు... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in second test
  • వాండరర్స్ వేదికగా టెస్టు మ్యాచ్
  • బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • వెన్నునొప్పితో మ్యాచ్ కు దూరమైన కోహ్లీ
  • కోహ్లీ స్థానంలో హనుమ విహారికి చోటు
జోహాన్నెస్ బర్గ్ లోని వాండరర్స్ మైదానంలో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 18, కేఎల్ రాహుల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అతడి స్థానంలో తెలుగుతేజం హనుమ విహారిని తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. అటు, దక్షిణాఫ్రికా జట్టులో రెండు మార్పులు చేశారు. క్వింటన్ డికాక్ రిటైర్మెంట్ నేపథ్యంలో వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ ను ఎంపిక చేశారు. పేసర్ వియాన్ ముల్డర్ స్థానంలో డువానే ఒలీవియర్ జట్టులోకి వచ్చాడు.
Team India
Toss
Second Test
Wanderers
South Africa
Johannesburg
Cricket

More Telugu News