Krishna: మా కుటుంబానికి ఎంతో ఆప్తుడైన వ్యక్తిని కోల్పోయాం: ఘట్టమనేని కృష్ణ

Superstar Krishna condolences to the demise of director Chandrasekhar Reddy
  • దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి మృతి
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన కృష్ణ
  • తనకు ఎంతో సన్నిహితుడని వెల్లడి
  • తామిద్దరం 23 సినిమాలు చేశామన్న కృష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమ సీనియర్ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి (86) అనారోగ్యంతో మరణించడం పట్ల సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి తనకు వ్యక్తిగతంగా ఎంతో సన్నిహితుడని తెలిపారు. తమ కుటుంబానికి ఎంతో ఆప్తుడైన వ్యక్తిని కోల్పోయామని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నామని, వారి కుటుంబానికి సానుభూతి తెలుపుకుంటున్నానని కృష్ణ ఓ ప్రకటనలో వివరించారు.

"చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం అత్తలు కోడళ్లు. అందులో నేనే కథానాయకుడ్ని. ఆ తర్వాత ఆయన రెండో చిత్రం 'అనురాధ'లోనూ నేనే హీరోని. మా ఇద్దరి కలయికలో 23 సినిమాలు వచ్చాయి. వాటిలో ఇల్లు ఇల్లాలు, కొత్త కాపురం, పాడిపంటలు, నా పిలుపే ప్రభంజనం వంటి చిత్రాలు హిట్టయ్యాయి. మా పద్మాలయా అనుబంధ సంస్థలో ఆయన డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు" అంటూ కృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Krishna
Chandrasekhar Reddy
Demise
Condolences
Tollywood

More Telugu News