vaccine: ఏపీలో నిన్న 5 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు

vaccines in ap

  • దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు
  • ఏపీలో మొత్తం 6,454 కేంద్రాల్లో వ్యాక్సిన్ల పంపిణీ
  • చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 72,146 మంది పిల్లలకు వ్యాక్సిన్లు

దేశంలో 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య‌ వయసు కలిగిన పిల్లలకు నిన్న‌టి నుంచి క‌రోనా వ్యాక్సిన్ల పంపిణీ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోనూ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం ప్రారంభ‌మైంది. నిన్న ఏపీ వ్యాప్తంగా 5 లక్షల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేశారు.

ఏపీలో మొత్తం 6,454 కేంద్రాల్లో వ్యాక్సిన్లు వేసిన‌ట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్య‌ధికంగా 72,146 మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేశారు. కృష్ణా జిల్లాలో నిన్న ఉదయం 8 గంటల నుంచి ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రాత్రి ఏడు గంటల వరకు కొన‌సాగింది. ఆ జిల్లాలో 64 వేల మంది పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేశారు.

ఇక ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాతో పాటు శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి చొప్పున వ్యాక్సిన్లు వేశారు. చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్‌లో భాగంగా ప్ర‌తి ఒక్క‌రికి 0.5 ఎంఎల్ డోసు వేశారు. మొద‌టి డోసు తీసుకున్న‌ 28 రోజుల అనంతరం రెండో డోసు వేస్తారు. ఈ వ్యాక్సినేష‌న్‌ను ఈ నెల 7వ తేదీ వరకు నిర్వ‌హిస్తారు. ఇక నిన్న దేశ వ్యాప్తంగా మొత్తం 41 లక్షల మందికి చిన్నారుల‌కు వ్యాక్సిన్లు వేశారు.

  • Loading...

More Telugu News