Peddireddi Ramachandra Reddy: పల్లెబాట చేపట్టడానికి కారణం ఇదే: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని తెలుసుకుంటున్నాం
- అర్హులకు వంద శాతం పథకాలను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం
- ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే తాము పల్లెబాట కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఎన్నికలు లేకపోయినా... ప్రజలకు సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా? లేదా? అని తెలుసుకుంటున్నామని చెప్పారు. అర్హులైన అందరికీ వంద శాతం పథకాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అందుకే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నామని చెప్పారు.
ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆదుకునేందుకు సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉందని పెద్దిరెడ్డి అన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా సీఎం జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారని తెలిపారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందించడానికి గ్రామాలలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు ఎంతో చేస్తున్న జగన్ కు అందరూ మద్దతుగా నిలవాలని చెప్పారు.