Sanjana Galrani: విడాకులు తీసుకోబోతోందన్న వార్తలపై హీరోయిన్ సంజనా గల్రాని స్పందన!
- సంజన విడాకులు తీసుకోబోతోందని కన్నడ మీడియాలో కథనాలు
- ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటానన్న సంజన
- తమ వైవాహిక జీవితం బాగుందని వ్యాఖ్య
కన్నడ భామ సంజనా గల్రాని తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మకు గత కొంత కాలంగా టైమ్ అస్సలు బాగున్నట్టు లేదు. ఆ మధ్య డ్రగ్స్ కేసులో సంజన అరెస్ట్ అయింది. జైలుకు వెళ్లడం, బెయిల్ పై బయటకు రావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె సినీ కెరీర్ కొంత మసకబారింది.
ఈ క్రమంలో ఆమె తన ప్రియుడిని పెళ్లాడింది. ఆమె ప్రెగ్నెంట్ అని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్త నిజమో, కాదో క్లారిటీ రాకముందే... ఆమె గురించి మరో వార్త వైరల్ అవుతోంది. తన భర్త నుంచి ఆమె విడాకులు తీసుకోబోతోందని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ వార్తలపై సంజన మండిపడింది. తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. తమ వైవాహిక జీవితం హాయిగా ఉందని... తమ పర్సనల్ విషయాల్లో ఎవరూ కలగజేసుకోవద్దని కోరింది.