Prabhas: 'సిరివెన్నెల' కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రభాస్

Prabhas consoles Sirivennela family members
  • తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సిరివెన్నెల
  • సిరివెన్నెల నివాసానికి వచ్చిన ప్రభాస్
  • సిరివెన్నెల మృతి పట్ల విచారం
  • గీత రచయితకు నివాళులు
ఇటీవల టాలీవుడ్ సీనియర్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూయడం తెలిసిందే. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈ లోకాన్ని వీడారు. కాగా, అగ్రహీరో ప్రభాస్ నేడు సిరివెన్నెల నివాసానికి వచ్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిరివెన్నెల మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. దిగ్గజ గీత రచయితకు నివాళులు అర్పించారు. ప్రభాస్ నటించిన చక్రం సినిమాలోని "జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది" అంటూ సాగే హిట్ గీతాన్ని రాసింది సిరివెన్నెలే.
Prabhas
Sirivennela
Demise
Lyric Writer
Tollywood

More Telugu News