YS Sharmila: ఏపీలో రాజకీయ పార్టీపై షర్మిల వ్యాఖ్యలు... మంత్రి బాలినేని స్పందన!

Minister Balineni response on YS Sharmila comments on her political party in AP
  • రాజకీయ పార్టీని ఎక్కడైనా పెడతామని ఇటీవల వ్యాఖ్యానించిన షర్మిల
  • ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన షర్మిల వ్యాఖ్యలు
  • తామంతా వైయస్సార్ కుటుంబమేనన్న మంత్రి బాలినేని
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుకుగా వున్న వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఏపీలో రాజకీయ పార్టీ పెట్టడంపై ఇటీవల స్పందించిన సంగతి విదితమే. ఏపీలో కూడా పార్టీ పెట్టే ఉద్దేశం ఉందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ, 'పెట్టకూడదనే రూల్ ఏమైనా ఉందా?' అని ప్రశ్నించారు. రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎక్కడైనా పెడతామని ఆమె చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచాయి.

ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. షర్మిల, తామంతా వైయస్సార్ కుటుంబమని, అందరం ఒకటేనని చెప్పారు. ఏపీలో పార్టీ పెడతానని షర్మిల చెప్పలేదని, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
YS Sharmila
YSRTP
Balineni Srinivasa Reddy
YSRCP
Andhra Pradesh
New Party
Jagan

More Telugu News