Rajasekhar: 'శేఖర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్!

Sekhar Movie first single released
  • 'శేఖర్'గా రాజశేఖర్
  • హీరోగా 91వ సినిమా  
  • దర్శకురాలిగా జీవిత
  • చివరిదశలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు 
రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న 'శేఖర్' .. హీరోగా ఆయన 91వ సినిమా. దీనికి జీవితా రాజశేఖర్ దర్శకురాలు. స్క్రీన్ ప్లే కూడా ఆమెనే సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం దీనిని నిర్మిస్తున్నారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా మొదటి పాటను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. "ఒరేయ్ నీ లవ్ స్టోరీ ఒకటి చెప్పురా" అనే వాయిస్ ఓవర్ తో 'లవ్ గంట మోగిందంట' అంటూ మొదలవుతుంది. అనూప్ రూబెన్స్ ఇచ్చిన క్యాచీ ట్యాన్ కి చంద్రబోస్ సాహిత్యంతో ప్రేమకథని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ పాటని విజయ్ ప్రకాష్, అనూప్, రేవంత్ సంయుక్తంగా ఆలపించారు.  

ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ "ఆల్రెడీ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుండి ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ సింగల్ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని అన్నారు. రాజశేఖర్, ఆత్మీయ రజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, తనికెళ్ల భరణి, రవివర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు..
Rajasekhar
Jeevitha
Sekhar Movie

More Telugu News