Btech Ravi: అవినాశ్ రెడ్డి, శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షకు అంగీకరించాలి: టీడీపీ నేత బీటెక్ రవి

YS Avinash Reddy has to take Norco analysis test says Btech Ravi
  • వివేకా కుటుంబానికి అన్యాయం జరుగుతోంది
  • నిందితుడు శంకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలో ఉన్నారు
  • దీంతో జగన్ పై కూడా అనుమానాలు కలుగుతున్నాయి
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య అందరినీ షాక్ కు గురి చేసిందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. వివేకా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి పులివెందుల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని చెప్పారు.

ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డి, ఆయన అనుచరుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డిలు నార్కో అనాలసిస్ పరీక్షలకు ఒప్పుకోవాలని... లేని పక్షంలో హత్యతో వారికి సంబంధం ఉన్నట్టు అనుమానించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కేసులో నిందితుడు శంకర్ రెడ్డి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని... దీంతో జగన్ పై కూడా అనుమానాలు వస్తున్నాయని చెప్పారు.
Btech Ravi
Telugudesam
YS Avinash Reddy
Jagan
YS Vivekananda Reddy
YSRCP

More Telugu News