tata medical: ఒమిక్రాన్ సోకిందా, లేదా? నాలుగు గంటల్లో చెప్పే కొత్త టెస్ట్ కిట్

Test kit for Omicron to be in stores from January 12

  • టాటా మెడికల్ డయాగ్నోస్టిక్స్ అభివృద్ధి
  • ఒక్కో కిట్ ధర రూ.250
  • 12 నుంచి అందుబాటులోకి
  • కచ్చితమైన ఫలితాలు ఉంటాయన్న వైద్యులు

కరోనా వైరస్ బారిన పడినవారు.. అది డెల్టా రకమా? లేక ఒమిక్రాన్ రకమా? తెలుసుకోవాలంటే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారానే తెలుస్తుంది. ఇందుకు సమయం, అదనపు వ్యయం అవసరమవుతాయి. కానీ, తక్కువ ఖర్చుకే కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ లేదా నెగెటివ్ చెప్పే టెస్ట్ కిట్ 'ఒమిష్యూర్'ను టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ రూపొందించింది. ఇది ఈ నెల 12 నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

దీని ధర రూ.250. ఎస్ జీన్ టార్గెట్ ఫెయిల్యూర్, ఎస్ జీన్ మ్యుటేషన్ యాంప్లికేషన్ ను కంబైన్ చేయడం ద్వారా ఒమిక్రాన్ రకాన్ని నిర్ధారిస్తుంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల మధ్య కచ్చితమైన భేదం చూపించే మొదటి పరీక్ష ఇదేనని, నాలుగు గంటల్లో ఫలితం వచ్చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

నూతన టెస్ట్ కిట్ తో అధికశాతం కచ్చితమైన ఫలితాలు ఉంటాయని నాట్ హెల్త్ ప్రెసిడెంట్ హర్ష మహాజన్ తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన అన్ని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ గు పంపించాల్సిన ఇబ్బంది తప్పుతుందన్నారు.

  • Loading...

More Telugu News