Chiarnjeevi: 'ఇంద్ర' సినిమా చూడడానికి ఒక వ్యక్తి బ్లాక్ లో 5 టిక్కెట్లను 10 వేలకి కొన్నట్టుగా తెలిసి ఆశ్చర్యపోయాం: బి.గోపాల్

B Gopal said about Indra movie

  • చిరూ కెరియర్లోనే ప్రత్యేకం 'ఇంద్ర'
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
  • దర్శకుడిగా బి.గోపాల్
  • మ్యూజికల్ హిట్ చేసిన మణిశర్మ  

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల వరుసలో 'ఇంద్ర' కూడా కనిపిస్తుంది. ఫ్యాక్షన్ సినిమాలతో బాలకృష్ణ మాంఛి జోరుమీదున్న సమయంలో, అదే ఫ్యాక్షన్ నేపథ్యంలో చిరంజీవి చేసిన సినిమా ఇది. అప్పటివరకూ బాలకృష్ణకి భారీ విజయాలను అందిస్తూ వచ్చిన బి. గోపాల్ ఈ సినిమాతో మెగా స్టార్ కి మరిచిపోలేని హిట్ ఇచ్చారు.

ఆ సినిమా విశేషాలను బి. గోపాల్ గుర్తు చేసుకుంటూ .. "చిరంజీవితో నేను చేసిన ఫస్టు మూవీ 'స్టేట్ రౌడీ'. ఆ తరువాత మా ఇద్దరి కాంబినేషన్లో 'మెకానిక్ అల్లుడు' వచ్చింది. ఆ తరువాత 'ఇంద్ర' చేసే ఛాన్స్ వచ్చింది. చిన్నికృష్ణ కథ .. పరుచూరి స్క్రీన్ ప్లే .. మణిశర్మ సాంగ్స్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.

ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. సాధారణంగా బ్లాక్ లో టిక్కెట్లు ఐదారొందలు పెట్టి కొంటూ ఉంటారు. కానీ ఒక చోట ఒక వ్యక్తి బ్లాక్ లో 5 టిక్కెట్లను 10 వేలకి కొన్నట్టుగా తెలిసి ఆశ్చర్యపోయాం. రిలీజ్ సమయంలో థియేటర్ల దగ్గర జనాలను కంట్రోల్ చేయడానికి ఎస్పీ స్థాయి ఆఫీసర్లు రంగంలోకి దిగవలసి వచ్చింది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News