Supreme Court: నీట్-పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు లైన్ క్లియర్.. ఈడబ్ల్యూఎస్ కోటాకు రూ.8 లక్షల ఆదాయ పరిమితికి అనుమతి

SC allows admissions into neet pg

  • ఈడబ్ల్యూఎస్ చెల్లుబాటుపై మార్చిలో విచారణ
  • తుది ఆదేశాలకు లోబడే ప్రవేశాలు
  • అప్పటి వరకు ప్రస్తుత కోటాలు చెల్లుబాటు  

2021-22 విద్యా సంవత్సరానికి గాను వైద్య విద్యలో దేశవ్యాప్త ప్రవేశాలకు అడ్డంకులు తొలగిపోయాయి. నీట్-పీజీ ప్రవేశాలు చేపట్టేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి తెలిపింది. ఓబీసీలకు 27%.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు (ఈడబ్ల్యూఎస్) 10% కోటా అమలుకు రాజ్యాంగబద్ధ హోదాను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.  

ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబాటు అర్హతను నిర్ధారించేందుకు రూ.8 లక్షల ఆదాయ పరిమితికి సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. అది కూడా ప్రస్తుత విద్యా సంవత్సరానికి అమలు కానుంది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.  

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అర్హతలకు అనుసరించే ప్రక్రియపై మార్చి మూడో వారంలో పూర్తిస్థాయి విచారణ నిర్వహిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటా చెల్లుబాటును అప్పుడే తేలుస్తామని పేర్కొంది. ప్రస్తుతం చేపట్టే ప్రవేశాలు తుది ఆదేశాలకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News