Dharmapuri Arvind: ఎంపీ అర్వింద్ పై చర్యలు తీసుకోవద్దు: పోలీసులకు హైకోర్టు ఆదేశం
- సోషల్ మీడియాలో కేసీఆర్ కార్టూన్ ఫొటో షేర్ చేసిన అర్వింద్
- సీఎంపై తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదు
- కార్టూన్ షేర్ చేయడం క్రిమినల్ చర్య కాదన్న హైకోర్టు
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అర్వింద్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే కేసీఆర్ కార్టూన్ ఫొటోను ఇటీవల అర్వింద్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో సీఎంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు నమోదైంది. తప్పుడు ప్రచారం చేయడంతో సమాజంలో శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు యత్నించారంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు... కార్టూన్ ఫొటోను షేర్ చేయడం క్రిమినల్ చర్య కాదని పేర్కొంది.